తెలంగాణ హైకోర్టు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, జగదీష్‌రెడ్డిలకు ఊరట కలిగించింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు ఆధారంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును హైకోర్టు రద్దు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తనపై తప్పుడు ప్రచారం జరిగిందని మల్లన్న ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసుపై జరిగిన విచారణ అనంతరం హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది.