స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 9ను హైకోర్టు ప్రశ్నించింది. అసెంబ్లీ బిల్లుకు గవర్నర్ ఆమోదం లేకుండానే అధికారులు జీవో ఎలా జారీ చేస్తారని నిలదీసింది. జీవో నెం. 9 చట్టబద్ధత ఏమిటని, దాని ఆధారంగా ఎన్నికలకు ఎలా వెళ్తారని, ఈ పిటిషన్లపై తదుపరి విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసింది. అప్పటివరకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడదని ప్రభుత్వం హామీ ఇవ్వాలని కోరింది. హామీ ఇవ్వకపోతే జీవో 9 అమలును నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.