విద్యుదాఘాతంతో హోంగార్డు మృతి

వికారాబాద్  జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో పోలీసు వాహనాన్ని శుభ్రం చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా హోంగార్డు శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వివరాలు అడిగి తెలుసుకున్న ఎస్పీ, మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్