హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ వాహన తయారీ ప్లాంటు ఏర్పాటు చేయనుంది. కర్ణాటకలోని కోలార్ జిల్లా నరసపురలోని ప్రస్తుత ప్లాంటు పక్కనే రూ.600 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ను త్వరలో ప్రారంభించనుంది. ఇక్కడ తయారయ్యే ఈవీలు దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాలకు కూడా ఎగుమతి కానున్నాయి. ప్రస్తుతం హోండా యాక్టివా-ఈ, క్యూసీ1 ఈవీ స్కూటర్లను విక్రయిస్తోంది.