నుదిటపై సిందూరం చూసి ఇంటర్ అమ్మాయి పరువు హత్య

యూపీలోని గోరఖ్‌పూర్‌లో 19 ఏళ్ల నిత్య యాదవ్ అనే అమ్మాయి తన సోదరుడు ఆదిత్య చేతిలో దారుణ హత్యకు గురైంది. ప్రేమ వ్యవహారం నడుపుతోందని, నుదిటిపై సింధూరం పెట్టుకుందని ఆదిత్యకు అనుమానం రావడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన నిత్య, మరుసటి రోజు ప్రేమికుడితో కలిసి కనిపించింది. ఆదిత్య ఆమెను ఇంటికి తీసుకువచ్చి, రెండున్నర కిలోమీటర్ల దూరంలోని ఒక చెరువులో ముంచి చంపేశాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి నేరం అంగీకరించాడు.

సంబంధిత పోస్ట్