పొట్టిగా ఉన్నాడని పరువు హత్య.. ఏడుగురి అరెస్ట్

AP: బావని సొంత బావమరిదే హత్య చేసిన ఘటన గుంటూరులో సంచలనం రేపిన విషయం తెలిసిందే. తన సోదరిని పెళ్లి చేసుకున్న కుర్రా గణేశ్ పొట్టిగా ఉన్నాడని కక్ష పెంచుకున్న అతని బావమరిది ఈ దారుణానికి ఒడిగట్టాడు. మరికొందరితో కలిసి నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపాడు. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు హత్యలో పాల్గొనగా, మరో ముగ్గురు వీరికి ఆశ్రయం కల్పించినట్లు దర్యాప్తులో తేలింది.

సంబంధిత పోస్ట్