ఘోరం.. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం

AP: రాష్ట్రంలో ఘోరం జరిగింది. బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో శనివారం ఏడేళ్ల చిన్నారిపై సూరిబాబు (45) అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలికకు తినుబండారాలు కొనిస్తానని చెప్పి, పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు. బాలిక కేకలు విని స్థానికులు అక్కడికి చేరుకోగా.. అప్పటికే సూరిబాబు పారిపోయాడు. చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి.. చిన్నారిని చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్