డాక్టర్ ఇంట్లో భారీ డ్రగ్స్ స్వాధీనం

హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో డాక్టర్ జాన్‌పాల్ ఇంట్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. మంగళవారం ఉదయం పోలీసులు దాడి చేసి, ఓజీ కుష్, ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ, హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ జాన్‌పాల్‌ను అరెస్టు చేయగా.. మిగాతా ముగ్గురు పరారీలో ఉన్నారు. ఢిల్లీ, బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్