పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ మస్తుంగ్ జిల్లాలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. రైల్వే ట్రాక్‌పై జరిగిన భారీ పేలుడు కారణంగా క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న ట్రైన్ పట్టాలు తప్పింది. రైలులోని నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. మంగళవారం సాయంత్రం IED పదార్థాలతో బ్లాస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ బ్లాస్ట్ ఎవరు చేశారనేది ఇంకా తెలియదు. ఈ ఘటనలో 20 మందికి పైగా మరణించినట్లు సమాచారం.