TG: లిక్కర్ షాపుల లైసెన్సు ఫీజుల ద్వారా రూ. 2,854 కోట్లు ఆదాయం రావడంతో, తెలంగాణ ప్రభుత్వం పలు విభాగాల్లో ఉన్న బకాయిలను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు రూ. 304 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి 4 రూ.252 కోట్లు విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, మున్సిపాలిటీలు, పంచాయతీల రోడ్ల మరమ్మతులకు కూడా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి విభాగంలో కాంట్రాక్టర్ల బకాయిలను చెల్లించేందుకు ఒక్కో విభాగానికి రూ.1 కోటి చొప్పున కేటాయించనుంది.