భార్యతో ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన భర్త(వీడియో)

TG: ప్రియునితో కలిసి భార్య తనని చంపేందుకు కుట్ర చేస్తోందని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం జగ్గు తండాలో చోటు చేసుకుంది. బానోతు రమేష్, శాంతలు భార్యాభర్తలు. తండాకు చెందిన దేవేందర్ అనే వ్యక్తితో శాంత ఎఫైర్ పెట్టుకుందని బాధితుడు ఆరోపించాడు. ఈ క్రమంలోనే దేవేందర్ కత్తితో నరికేందుకు రాగా తప్పించుకున్నానని మహేష్ తెలిపాడు. తన భార్య శాంత, ఆమె ప్రియుడు నుంచి ప్రాణహాని ఉందంటూ బాధితుడు వాపోయాడు.

సంబంధిత పోస్ట్