చికెన్ వండలేదని భార్యపై భర్త దాడి.. తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో దారుణం జరిగింది. 10 నెలల క్రితం పెళ్లైన రీనా(21)కు భర్త నిగమ్ ఆగస్టు 21న మద్యం తాగి ఇంటికి చికెన్ తీసుకువచ్చి వండమని చెప్పాడు. అయితే రీనా వెజ్ కర్రీ చేయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో నిగమ్ దాడి చేయగా మనస్థాపం చెందిన రీనా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో భయపడిన నిగమ్, తన బంధువులతో కలిసి శవాన్ని గంగా నదిలో పడేసి, భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారించడంతో నేరాన్ని ఒప్పుకున్నాడు.

సంబంధిత పోస్ట్