భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యాయత్నం (వీడియో)

యూపీలోని ఆగ్రాలో పోలీసు అప్రమత్తత వల్ల ఓ వ్యక్తి నిండు ప్రాణాలు నిలిచాయి. ఫరూఖాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను ఇంటికి తీసుకెళ్లడానికి రామ్‌నగర్‌లోని తాజ్‌గంజ్‌కు వచ్చాడు. అయితే భర్తతో వెళ్లేందుకు ఆమె నిరాకరించింది. మనస్తాపం చెంది ఫ్లైఓవర్‌ మీదకు చేరుకున్నాడు. కిందికి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి ఓ పోలీసు ఆయనను పట్టుకుని కాపాడాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్