భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త

AP: నంద్యాల జిల్లాలో మంగళవారం రాత్రి దారుణ ఘటన జరిగింది. అనుమానంతో ఓ భర్త తన భార్యను రోకలి బండతో కొట్టి చంపాడు. ఈ ఘటన అబండతండాలో జరగ్గా స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శివకృష్ట, కవితకు 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీళ్ళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే భర్త శివకృష్ణ భార్య కవితపై అనుమానంతో రోజు హింసించేవాడని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్