రెండో భార్యను దారుణంగా చంపిన భర్త

TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం వెంకన్నగూడలో దారుణ ఘటన జరిగింది. కుటుంబ కలహాలతో తన రెండో భార్య రజితను భర్త జంగయ్య అతి దారుణంగా చంపాడు. చున్నీతో ఉరేసి.. తలపై రాయితో కొట్టి హతమార్చాడు. ఆ తర్వాత మొదటి భార్యకు చంపిన ఫొటోలు పంపించాడు. కాగా రజిత రెండేళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్