భార్యను కత్తితో పొడిచి భర్త ఆత్మహత్య

AP: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భార్యను హత్య చేసిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య జోత్స్నను కత్తితో పొడిచి, అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు భర్త ఆంజనేయులు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆంజనేయులు, జోత్స్న దంపతులకు ఇద్దరు కుమారులు అఖిల్ (7) అరుణ్ (5) ఉన్నారు. సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్