భార్యతో ఎఫైర్.. స్నేహితుడిని నరికి చంపిన భర్త

భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడనే కోపంతో స్నేహితుడిని భర్త నరికి చంపిన దారుణ ఘటన బిహార్‌లోని మాధేపురాలో జరిగింది. భట్నికి చెందిన విజయ్ కుమార్ గురువారం రాత్రి తన ఇంట్లో మోటర్ మరమ్మతు కోసం తన ఫ్రెండ్ రాజీవ్ కుమార్(17)ను పిలిచాడు. రాత్రి విజయ్ నిద్రపోయిన తర్వాత, అతడి భార్య రాజీవ్ వద్దకు వచ్చింది. అసభ్యకర స్థితిలో వారిద్దరినీ చూసిన విజయ్.. రాజీవ్‌పై కత్తితో దాడి చేశాడు. రెండు వేట్లకే మెడ తెగిపోయి రాజీవ్ అక్కడికక్కడే మరణించాడు.

సంబంధిత పోస్ట్