భార్యను చంపి బావిలో పడేసిన భర్త (వీడియో)

కర్ణాటకలోని విజయపుర జిల్లా సింధగి తాలూకాలోని గనిహర గ్రామంలో దారుణ ఘటన జరిగింది. భార్య నీలమ్మ అనగొండ(46)ను ఆమె భర్త పరమానంద్ నరికి చంపి బావిలో పడేసి పరారయ్యాడు. మొక్కజొన్న పంటలో పందులు చొరబడకుండా ఉండటానికి ఆమె పటాకులు పేల్చడానికి వెళ్ళినప్పుడు వెనుక నుండి దాడి చేశాడని పోలీసులు తెలిపారు. నీలమ్మ మృతదేహం సగ భాగం బావిలో గుర్తించారు. మిగిలిన భాగం కోసం గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్