హైదరాబాద్ మెట్రో రైలు టైమింగ్స్ శనివారం ప్రత్యేకంగా పొడిగించబడ్డాయి. అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి 11:45 గంటలకు బయలుదేరనుంది. వినాయక మండపాల దర్శనాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఎక్కువ సమయం, ఎక్కువ భక్తి, ఎక్కువ సౌకర్యం కోసం ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాంటూ మెట్రో ప్రకటించింది.