జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ యూసఫ్ గూడలోని పోలీస్ లైన్స్, వెంకటగిరి కాలనీలో శనివారం ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించిన ఆయన, కాంగ్రెస్ కు ఈ ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.