హైదరాబాద్ లోని మూసారంబాగ్ వంతెన సమీపంలో శనివారం కృష్ణా నగర్, దుర్గా నగర్, అంబేద్కర్ కాలనీలు జంట జలాశయాల గేట్లు తెరవడంతో పూర్తిగా జలమయం అయ్యాయి. టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్, అధికారులు బాధిత ప్రాంతాలను పరిశీలించి, ఇళ్లలో ఉన్న వారిని రిలీఫ్ సెంటర్లకు తరలించారు. ప్రజలను వరదలపై అప్రమత్తం చేశారు.