మంగళవారం, ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లోని గోదావరి హాస్టల్ వద్ద విద్యార్థులు నిరసన చేపట్టారు. నాణ్యత లేని, కల్తీ ఆహారాన్ని అందిస్తున్నారని, దీనిపై ప్రశ్నిస్తే ఫుడ్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.