హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో వీకెండ్ సందర్భంగా హిమాయత్‌సాగర్‌లో చేపలు పట్టేందుకు వెళ్లిన ముగ్గురు స్నేహితులు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. చేపలు పట్టిన తర్వాత ఈత కొట్టేందుకు నీటిలోకి దిగగా, లోతు ఎక్కువగా ఉండటంతో ఈ దుర్ఘటన జరిగింది. స్థానికులు ఒక యువకుడిని రక్షించగా, షేక్ సల్మాన్, షాహెబాజ్ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.