నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

రోడ్డు ప్రమాదాల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పందించారు. 'నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. రోడ్లు బాగున్నా వంపులు ఎక్కువగా ఉంటే యాక్సిడెంట్లు పెరుగుతాయని చెప్పాను. రోడ్లు బాగుంటేనే ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయని నేను అన్నట్లుగా వీడియో ఎడిట్ చేశారు. రియల్ ఎస్టేట్ ఆలోచనతో గతంలో రోడ్డుకు భూసేకరణ చేశారు' అని ఓ మీడియాతో అన్నారు.

సంబంధిత పోస్ట్