రోడ్డు ప్రమాదంలో విద్యార్థినుల మృతి పట్ల ప్రిన్సిపాల్ సంతాపం

చేవెళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కోఠి వీరానారి చాకలి ఐలెమ్మ విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు మృతి చెందడంపై విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ లోక పావని సోమవారం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన సాయి ప్రియ (బీఎస్సీ), నందిని (బీకాం), ముస్కాన్ (ఎంపీసీఐఎస్) తాండూరు వాసులని, వీరిలో ఇద్దరు హాస్టల్ విద్యార్థులు, ఒకరు డే స్కాలర్ అని తెలిపారు. చదువులో ప్రతిభ కనబరిచిన ఈ విద్యార్థినుల మరణం అత్యంత బాధాకరమని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్