టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై రాజాసింగ్ ఆగ్రహం

టీడీపీ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భగవద్గీతపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. శుక్రవారం విడుదల చేసిన వీడియోలో, ఎంఎస్ రాజును 'బుద్ధి లేని వ్యక్తి'గా అభివర్ణిస్తూ, హిందూ ధర్మంపై నమ్మకం, జ్ఞానం లేనివారిని టీటీడీ బోర్డులో ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. టీడీపీలో ఇలాంటి వ్యక్తులు మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉండటంపై చంద్రబాబు నాయుడు సర్వే చేయాలని కోరారు. ఎంఎస్ రాజును పార్టీ నుంచి సస్పెండ్ చేసి, భగవద్గీత, హిందూ ధర్మంపై మరెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ ఏపీ సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. ఎంఎస్ రాజు 'భగవద్గీత ప్రజల బతుకులను మార్చలేదు' అని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దుమారం రేగింది.

సంబంధిత పోస్ట్