బీజేపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ మాటకారి అని, తుపాకీ వెంకట్రావులా మభ్యపెడతారని ఆరోపించారు. మోసపూరిత మాటలతోనే కాంగ్రెస్ సర్కార్ వచ్చిందని, రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కయ్యారని అన్నారు. రేవంత్, మంత్రుల అవినీతిపై బీజేపీ మాట్లాడటం లేదని, అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి మోసం చేశారని విమర్శించారు. హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసేవారు నిండా మునిగారని, రేవంత్ వల్ల హైదరాబాద్ మొత్తం కుప్పకూలిపోయిందని, రైతుల వడ్లకు కాంటాలు, బస్తాలు ఇవ్వలేదని, రేవంత్ వల్లే ధాన్యం తడిసిపోయిందని ఎర్రబెల్లి పేర్కొన్నారు.