ఉపఎన్నిక ప్రచారంలో మంత్రి జూపల్లికి చేదు అనుభవం (వీడియో)

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం ముమ్మరం చేసింది. ఇవాళ ప్రచారం చేస్తుండగా మంత్రి జూపల్లి కృష్ణారావును, అభ్యర్థిని నవీన్ యాదవ్‌ను ఓ వృద్ధురాలు నిలదీశారు. ఎన్నికల ముందు చెప్పినట్టు 4 వేల పెన్షన్ ఎక్కడని, కరెంట్ బిల్లు కూడా వస్తుందని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వస్తారు కానీ.. మిగతా సమయంలో పట్టించుకోరా? అని మంత్రిని అడిగారు. మంత్రి ఆమెకు సర్ధిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినిపించుకోలేదు.

సంబంధిత పోస్ట్