జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ ప్రధాన పార్టీల్లో నేతల చేరికలు కీలకంగా మారనున్నాయి. తాజాగా ఎర్రగడ్డకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత షరీఫ్ ఖురేషి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఖురేషికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇక బీఆర్ఎస్‌లో కూడా పలువురు నేతలు చేరుతున్నారు. దీంతో ఎవరికి నష్టం జరుగుతుంది? ఎవరు లాభపడే అవకాశం ఉందనేది ఆసక్తిగా మారింది.