వరల్డ్ హార్ట్ డే సందర్భంగా, లంగర్ హౌస్ బాపూ ఘాట్‌లో రెనోవా హాస్పిటల్ ఆధ్వర్యంలో 3కే రన్ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోల్కొండ ఏసీపీ ఫయాజ్ హాజరై పరుగును ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో మార్పులు చేసుకుని, రోజుకు కనీసం గంట సమయం వ్యాయామానికి కేటాయించాలని ఏసీపీ ఫయాజ్ పిలుపునిచ్చారు. బాపూ ఘాట్ వద్ద ప్రారంభమైన ఈ పరుగు లంగర్ హౌస్ దర్గా వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక యువతతో పాటు సీనియర్ సిటిజన్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.