హైదరాబాద్ కూకట్పల్లిలోని శాంతినగర్ మూడవ రోడ్ లో చింతపట్ల వెంకటరామయ్య పార్కు సమీపంలో శుక్రవారం రాత్రి వినాయక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వినాయక నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన ఈ ఉత్సవాలలో పార్వతీదేవి అవతారంలో చేసిన నృత్యం, మరియు మంటలతో గగుర్పాటు కలిగించే దృశ్యాలు ప్రదర్శించారు. అదేవిధంగా శివావతారం, కాలికావతారం మరియు దుష్టుడి అవతారంలో నిర్వహించిన దృశ్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.