హైదరాబాద్ నగరంలో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. హిమాయత్ సాగర్ గేట్లను ఒకేసారి తెరవడంతో మూసీలో నీటి ప్రవాహం భారీగా పెరిగింది. అధికారులు అప్రమత్తమై, రక్షణ చర్యలు చేపడుతున్నారు. డ్రోన్ విజువల్స్ నది ఉధృతిని కళ్లకు కడుతున్నాయి. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు వెలువడ్డాయి.