మన్సూరాబాద్ హనుమాన్ ఆలయంలో చోరీ: హుండీ పగులగొట్టి నగదు అపహరణ

మన్సూరాబాద్ చౌరస్తా సమీపంలోని హనుమాన్ దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ ప్రాంగణంలోని హుండీని పగులగొట్టి అందులోని నగదును అపహరించుకుపోయారు. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బుధవారం ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి గుడి తలుపు తెరిచి ఉండటాన్ని గమనించారు. ఆలయ కమిటీ సభ్యుల కథనం ప్రకారం ఈ ఘటన జరిగింది.

సంబంధిత పోస్ట్