గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆమె ఆరోపించారు. విద్యార్థినులతో కలిసి "స్కూటీలు ఎక్కడ?" అని నినదిస్తూ, ఆరు గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్ కు ఓటు వేయవద్దని ఆమె కోరారు. కమలం గుర్తుకు ఓటు వేసి దీపక్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్