మలక్ పేట్: గ్రేటర్ లో రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు

గ్రేటర్ లో రేషన్ కార్డుల కోసం ప్రజలు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. సర్కారు మాత్రం అదిగో, ఇదిగో అంటోంది. గతేడాది ప్రజాపాలనలో దాదాపు 5. 73 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఆన్లైన్లో 2. 60 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఇప్పటికే 83 వేల మందిని అధికారులు సర్వేలో గుర్తించారు. అయితే కార్డులు మాత్రం ఇవ్వలేదు. అసలు కార్డుల కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకుంటే ఇస్తారని పలువురు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్