ఇండియన్ పోస్ట్ హైదరాబాద్ ఆగ్నేయ మండల సీనియర్ సూపరింటెండెంట్ G. హైమవతి తెలిపిన వివరాల ప్రకారం, పోస్ట్ ఆఫీస్లలో 24/7 సేవలు అందుబాటులోకి వచ్చాయి. స్పీడ్ పోస్ట్, పార్సిల్ సర్వీస్, మనీ ఆర్డర్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. వనస్థలిపురం (24/7), చార్మినార్ (రాత్రి 9 గంటల వరకు), ఉప్పల్ (సాయంత్రం 6 గంటల వరకు), హైకోర్టు (సాయంత్రం 5 గంటల వరకు), శంషాబాద్ (సాయంత్రం 4.30 గంటల వరకు) పోస్ట్ ఆఫీస్లలో ఈ సేవలను వినియోగించుకోవచ్చని G. హైమవతి తెలిపారు.