స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, తమ తొత్తులతోనే కోర్టులో కేసు వేయించిందని కురుమ యువచైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు గొరిగే నరసింహ కురుమ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ తన ద్వంద వైఖరిని మార్చుకోవాలని, 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే బీసీలంతా ఐక్యమై ధర్నా చేస్తామని, ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. ఈ సంఘటన మేడ్చల్ లో జరిగింది.