బోడుప్పల్ లో 3 ఎకరాల భూమి తవ్వకం, కాలనీ వాసుల్లో ఆందోళన

బోడుప్పల్ లక్ష్మీగణపతి కాలనీ వాసులు 'కృతికా ఇన్ఫ్రా కంపెనీ'పై ఆదివారం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డెవలప్మెంట్ పేరుతో 3 ఎకరాల భూమిని తీసుకొని 25 అడుగుల లోతు తవ్వి వదిలేయడంతో వర్షాకాలంలో నీరు నిండి ప్రమాదకరంగా మారుతోందని, ప్రహరీ గోడకు ఆనుకొని ఉన్న ఇళ్లకు ముప్పు వాటిల్లుతుందని కాలనీ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి తెలిపారు. ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్