తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఘటన స్థలంలో స్పృహ తప్పి పడిపోయిన వారిని ఆసుపత్రులకు తరలించారు. పదుల సంఖ్యలో బాధితులు బెడ్లపై అచేతనంగా పడి ఉన్న దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. తమ పరిస్థితి ఏమిటో, తామెక్కడున్నారో తెలియని స్థితిలో పలువురు ఆసుపత్రి వద్ద ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రికి తరలించే లోపే చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.