మూసిలో నీటి మట్టం పెరుగుదల

హైదరాబాద్ లోని మూసి నదిలో నీటి మట్టం పెరగడంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు శనివారం తలెత్తాయి. ముఖ్యంగా చాధర్ ఘాట్ వద్ద నిర్మించిన వంతెనలు మునిగిపోవడంతో మలక్ పేట్ నుండి చాధర్ ఘాట్ కు, కోఠి నుండి మలక్ పేట్ కు వెళ్లే వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ, పరిస్థితి అదుపులోకి రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్