కూకట్ పల్లి పరిధిలోని జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్ద ఇద్దరు వ్యక్తులు కత్తులతో ఓ యువకుడిపై దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడగా, స్థానికులు అతడిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన దుండగులు పరారయ్యారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.