పెట్రోల్ కు బదులు డీజిల్ పోశారు.. ఒక్కసారిగా మంటలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుచిత్ర, అంగడిపేట హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం కారులో మంటలు చెలరేగాయి. పెట్రోల్ పంపు సిబ్బంది కారులో పెట్రోల్ బదులు డీజిల్ పోయడంతో ఈ ప్రమాదం జరిగింది. మెకానిక్ సహాయంతో డీజిల్ బయటకు తీస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. కారు ముందు భాగం కాలిపోయింది. కారు యజమాని పెట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్