కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ భవాని నగర్ లో ఆదివారం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పర్యటించి, నూతన సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. బస్తీ వాసులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం బస్తీల నుండి పట్టణాల వరకు రాష్ట్రం నలుమూలల అభివృద్ధి సాధించడమేనని ఆయన అన్నారు.