పేదలకు ఒక న్యాయం... పెద్దలకు ఒక న్యాయమా..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం సర్వే నెంబర్ 307 లో ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ కబ్జా చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 11 ఎకరాల భూమిని ఆదివారం మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముట్టడించారు. పేదలకో న్యాయం, పెద్దలకో న్యాయమా అని ప్రశ్నిస్తూ, హైడ్రా తీరు సిగ్గుచేటు అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, క్రిష్ణరావు, సునీత లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ రాజు, ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్