కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధిలోని బహదూర్ పల్లిలో విధి నిర్వహణలో ఉన్న పారిశుధ్య కార్మికులపై శనివారం టీ దుకాణం యజమాని శ్యామ్ దాడి చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. రోడ్డుపై చెత్త వేయవద్దని చెప్పినందుకు దుడ్డు సురేందర్, దుడ్డు బాలమణి, కొమ్ము వెంకటమ్మ అనే మునిసిపల్ కార్మికులపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై దుండిగల్ పోలీసులుకు మునిసిపల్ అధికారులు ఫిర్యాదు చేశారు. దాడికి నిరసనగా కార్మికులు రోడ్డుపై ధర్నా చేపట్టారు.