కుత్బుల్లాపూర్: కూల్చివేత బాధితులను కలిసిన కవిత

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామరం బాలయ్యబస్తీ, గాలీపోచమ్మ బస్తీలలో సర్వే నెంబర్ 307, 329/1, 342 లలో హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన నిర్వాసితులను సోమవారం ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. గాజుల రామారం లో పేదల ఇళ్లు కూల్చివేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, కోర్టు ఉత్తర్వులు అమలు చేయకుండా శని, ఆదివారాల్లో కూల్చివేతలు చేపట్టడం సరికాదని ఆమె అన్నారు. పండుగ పూట పేదల జీవితాల్లో చీకట్లు నింపడం ఈ ప్రభుత్వానికి అలవాటు అయ్యిందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్