హుక్కా సెంటర్ పై ఎస్ఓటీ పోలీసుల దాడులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్‌లో అనుమతి లేకుండా నడుస్తున్న డిఐ కాఫీ షాప్ అనే హుక్కా సెంటర్‌పై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,09,000 విలువైన 10 హుక్కా పాట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్