బహదూర్ పల్లిలోని గ్రీన్ హిల్స్ కాలనీలో శ్రీ నల్ల పోచమ్మ రేణుక ఎల్లమ్మ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు ఏడవ రోజు శ్రీ మహాచండీ దేవి అవతారంతో భక్తులకు దర్శనమిచ్చింది. భక్తులందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని ఆలయ కమిటీ కోరుకుంది. రేపు, 29-09-2025 సాయంత్రం 4 గంటల నుండి ఆలయం వద్ద బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలను ఆలయ ప్రెసిడెంట్ గడ్డం శ్రీనివాస్, శ్రీ సాయి సుబ్రహ్మణ్య సేవాసమితి సొసైటీ, ఆలయ ప్రధాన అర్చకులు మిరియాల మూర్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.