హైదరాబాద్‌లోని రాయదుర్గంలో మంగళవారం మధ్యాహ్నం భూ వివాదం కారణంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కర్నూలుకు చెందిన కృష్ణ అనే వ్యక్తి తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, రాయదుర్గం పోలీసులు కృష్ణను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘర్షణకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.