బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద రూ.3.6 కోట్ల గంజాయి స్వాధీనం

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడు అబ్దుల్ ఖాదర్ S (PP No-U2092815)ను ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అతని చెక్-ఇన్ బ్యాగ్ నుండి 3.6 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన మత్తు పదార్థం విలువ సుమారు రూ.3.6 కోట్లుగా అంచనా. నిందితుడిని కస్టడీలో ఉంచి, ఈ రోజు రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్